1 రాజులు 1:6

అతని తండ్రినీవు ఈలాగున ఏల చేయు చున్నావని అతనిచేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌంద ర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు.

సందర్భంతో చదవండి · 1 రాజులు 1

4​ఈ చిన్నది బహు చక్కనిదై యుండి రాజును ఆదరించి ఉపచారము చేయు చుండెను గాని రాజు దానిని కూడలేదు.

5​​హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించిన వాడైనేనే రాజు నగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్ప రచుకొనెను.

6అతని తండ్రినీవు ఈలాగున ఏల చేయు చున్నావని అతనిచేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌంద ర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు.

7అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని

8యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.

1 రాజులు 1 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी