యెహేజ్కేలు 19:7

​వారి నగరులను అవమాన పరచి వారి పట్టణములను పాడుచేసెను; దాని గర్జనధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 19

5తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయెనని తెలిసికొని, తన పిల్లలలో మరియొక దాని చేపట్టి దాని పెంచి కొదమ సింహముగా చేసెను.

6​ఇదియు కొదమసింహమై కొదమ సింహములతో కూడ తిరుగులాడి వేటాడనేర్చుకొని మనుష్యులను భక్షించునదై

7​వారి నగరులను అవమాన పరచి వారి పట్టణములను పాడుచేసెను; దాని గర్జనధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను.

8నలుదిక్కుల దేశపు జనులందరు దాని పట్టుకొనుటకు పొంచి యుండి ఉరి నొగ్గగా అది వారి గోతిలో చిక్కెను.

9అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసికొని పోయి అతనికి అప్పగించిరి; దాని గర్జనము ఇశ్రాయేలీ యుల పర్వతములమీద ఎన్నటికిని వినబడకుండునట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి.

యెహేజ్కేలు 19 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी