1 దినవృత్తాంతములు 10:9

అతని కవచమును దోచుకొని, అతని తలను అతని ఆయుధ ములను తీసికొని పోయి ఫిలిష్తీయుల దేశమంతట వాటిని త్రిప్పి, జరిగినదానిని విగ్రహములకును జనులకును చాటించిరి.

సందర్భంతో చదవండి · 1 దినవృత్తాంతములు 10

7జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి.

8హతులైనవారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులును గిల్బోవ పర్వతమందు చచ్చి పడియుండుట చూచి

9అతని కవచమును దోచుకొని, అతని తలను అతని ఆయుధ ములను తీసికొని పోయి ఫిలిష్తీయుల దేశమంతట వాటిని త్రిప్పి, జరిగినదానిని విగ్రహములకును జనులకును చాటించిరి.

10వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి.

11ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు విని నప్పుడు పరాక్రమశాలులైనవారందరును లేచిపోయి,

1 దినవృత్తాంతములు 10 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी