ఆదికాండము 44:16

యూదా యిట్లనెనుఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను.

సందర్భంతో చదవండి · ఆదికాండము 44

14అప్పుడు యూదా యును అతని సహోదరులును యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింక అక్కడనే ఉండెను గనుక వారు అతని యెదుట నేలను సాగిలపడిరి.

15అప్పుడు యోసేపుమీరు చేసిన యీ పని యేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా

16యూదా యిట్లనెనుఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను.

17అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవునుగాక; ఎవనిచేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును; మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా

18యూదా అతని సమీపించిఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారుగదా

ఆదికాండము 44 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी