లేవీకాండము 27:19

​​పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును.

సందర్భంతో చదవండి · లేవీకాండము 27

17అతడు సునాదసంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతి ష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము.

18​సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠిం చినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.

19​​పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును.

20అతడు ఆ పొలమును విడిపింపనియెడ లను వేరొకనికి దాని అమి్మనయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.

21ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.

లేవీకాండము 27 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी