1 సమూయేలు 14:11

వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండుకాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులుచూడుడి, తాము దాగియుండిన గుహలలోనుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు

సందర్భంతో చదవండి · 1 సమూయేలు 14

9వారు మనలను చూచిమేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన యెడల వారియొద్దకు పోక మనమున్నచోట నిలుచుదము.

10మాయొద్దకు రండని వారు చెప్పినయెడల యెహోవా వారిని మనచేతికి అప్ప గించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా

11వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండుకాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులుచూడుడి, తాము దాగియుండిన గుహలలోనుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు

12యోనా తానును అతని ఆయుధములను మోయువానిని పిలిచిమేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతానునా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీ యుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయు వానితో చెప్పి

13అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోను కాళ్లతోను ప్రాకి యెక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతనివెనుక వచ్చు అతని ఆయుధములు మోయు వాడు వారిని చంపెను.

1 సమూయేలు 14 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी