1 దినవృత్తాంతములు 24:3

దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.

సందర్భంతో చదవండి · 1 దినవృత్తాంతములు 24

1అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.

2నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.

3దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.

4వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.

5​ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.

1 దినవృత్తాంతములు 24 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी