2 దినవృత్తాంతములు 18:7

ఇశ్రాయేలు రాజుయెహోవా యొద్ద విచారణచేయుటకు ఇవ్లూ కుమా రుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగ గలిగియున్నాననగా యెహోషాపాతురాజు ఆలా గనవద్దనెను.

సందర్భంతో చదవండి · 2 దినవృత్తాంతములు 18

5ఇశ్రాయేలురాజు నాలుగువందల మంది ప్రవక్తలను సమకూర్చినేను రామోత్గిలాదుమీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారి నడిగెను. అందుకువారుపొమ్ము, దేవుడు రాజు చేతికి దానినప్పగించు నని చెప్పిరి.

6అయితే యెహోషాపాతుమనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా? అని యడుగగా

7ఇశ్రాయేలు రాజుయెహోవా యొద్ద విచారణచేయుటకు ఇవ్లూ కుమా రుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగ గలిగియున్నాననగా యెహోషాపాతురాజు ఆలా గనవద్దనెను.

8అప్పుడు ఇశ్రాయేలురాజు తన పరివార ములోనున్న యొకని పిలిపించిఇవ్లూ కుమారుడైన మీకా యాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను.

9ఇశ్రా యేలు రాజును యూదారాజగు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనములమీద కూర్చునియుండగా ప్రవక్తలందరును వారి ముందర ప్రవ చించుచుండిరి.

2 దినవృత్తాంతములు 18 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी