1 దినవృత్తాంతములు 27:16

మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీదనున్నవారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబే నీయులకు అధిపతిగా ఉండెను, మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను,

సందర్భంతో చదవండి · 1 దినవృత్తాంతములు 27

14​పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతో నీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగ ములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

15​​పండ్రెండవ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

16మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీదనున్నవారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబే నీయులకు అధిపతిగా ఉండెను, మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను,

17​కెమూ యేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు ఆహరోనీయులకు అధిపతిగా ఉండెను.

18​దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారు డైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,

1 దినవృత్తాంతములు 27 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी