అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందు దురు.
23యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును.
24సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.
25అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందు దురు.
26తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.
27నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి