నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలం పులు నన్ను కలతపెట్టెను.
3ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది.
4నెబుకద్నెజరను నేను నా యింట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనైయుండి యొక కల కంటిని; అది నాకు భయము కలుగజేసెను.
5నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలం పులు నన్ను కలతపెట్టెను.
6కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరిని నా యెదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చితిని.
7శకున గాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతి ష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి