లేవీకాండము 25:9

ఏడవ నెల పది యవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చి త్తార్థదినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను.

సందర్భంతో చదవండి · లేవీకాండము 25

7మరియు నీ పశువుల కును నీ దేశజంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును.

8మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను, అనగా ఏడేసి యేండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ యేడు విశ్రాంతి సంవత్సరములకాలము నలుబది తొమి్మది సంవత్సరములగును.

9ఏడవ నెల పది యవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చి త్తార్థదినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను.

10మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.

11​ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్స రము మీకు సునాదకాలము. అందులో మీరు విత్త కూడదు కారుపంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు.

లేవీకాండము 25 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी