2 కోరింథీయులకు 6:10

దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.

సందర్భంతో చదవండి · 2 కోరింథీయులకు 6

8ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.

9మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుం డియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము;

10దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.

11ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాట లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి యున్నది.

12మీయెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది.

2 కోరింథీయులకు 6 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी