యోనా 2:3

నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.

సందర్భంతో చదవండి · యోనా 2

1ఆ మత్స్యము కడుపులోనుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను.

2నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.

3నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.

4నీ సన్నిధిలోనుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయ ముతట్టు మరల చూచెదననుకొంటిని.

5ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టు కొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపునాచు నా తలకుచుట్టుకొని యున్నది.

యోనా 2 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी