యెహేజ్కేలు 43:5

ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణము లోనికి తీసికొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 43

3నాకు కనబడు దర్శనము, పట్టణమును నాశముచేయుటకై నేను రాగా నాకు కన బడిన దర్శనమువలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని.

4తూర్పుతట్టు చూచు గుమ్మపుమార్గమున యెహోవా తేజోమహిమ మందిరము లోనికి ప్రవేశించెను.

5ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణము లోనికి తీసికొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను.

6మందిరములోనుండి యొకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నాయొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను.

7నర పుత్రుడా, యిది నా గద్దె స్థలము, నా పాదపీఠము; ఇక్కడ నేను ఇశ్రాయేలీయులమధ్య నిత్యమును నివసించె దను, వారు ఇకను జారత్వముచేసి తమ రాజుల కళేబరము లకు ఉన్నత స్థలములను కట్టి, తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకయుందురు, నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి

యెహేజ్కేలు 43 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी