యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను.
25ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతని కిచ్చెను.
26పిమ్మటదావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి. దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.
27యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను.
28యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలిసికొని అచ్చటనే బలి అర్పించెను
29మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి