యెహేజ్కేలు 29:14

​చెరలోనుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరల రప్పించెదను, అక్కడ వారు హీనమైన యొక రాజ్యముగా ఉందురు,

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 29

12​నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తుదేశమును పాడగునట్టుగా చేసెదను, పాడై పోయిన పట్టణములమధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును, ఐగుప్తీయులను జనముల లోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్ల గొట్టుదును.

13​ప్రభువైన యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడునలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలోనుండి నేను వారిని సమకూర్చెదను.

14​చెరలోనుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరల రప్పించెదను, అక్కడ వారు హీనమైన యొక రాజ్యముగా ఉందురు,

15వారికను జనములమీద అతిశయపడకుండు నట్లు రాజ్యము లన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు; వారు ఇక రాష్ట్రములమీద ప్రభుత్వము చేయ కుండునట్లు నేను వారిని తగ్గించెదను.

16ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగినయెడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

యెహేజ్కేలు 29 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी