యెహేజ్కేలు 23:38

వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యదినములుగా ఎంచిరి.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 23

36మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెనునర పుత్రుడా, ఒహొలాకును ఒహొలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయుము.

37వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్టించిరి.

38వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యదినములుగా ఎంచిరి.

39తాము పెట్టు కొనిన విగ్రహములపేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్ర పరచి, నామందిరములోనే వారీలాగున చేసిరి.

40మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి; వారు రాగా వారికొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుకపెట్టుకొని ఆభరణములు ధరించు కొని

యెహేజ్కేలు 23 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी