1 సమూయేలు 12:2

రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు, మీ మధ్యనున్నారు; బాల్యమునాటినుండి నేటివరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చితిని.

సందర్భంతో చదవండి · 1 సమూయేలు 12

1అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెనుఆలకించుడి; మీరు నాతో చెప్పినమాట నంగీకరించి మీమీద ఒకని రాజుగా నియమించి యున్నాను.

2రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు, మీ మధ్యనున్నారు; బాల్యమునాటినుండి నేటివరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చితిని.

3​ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా? ఎవని గార్దభమునైన పట్టు కొంటినా? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తు ననెను.

4​నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు; ఏ మనుష్యునియొద్దగాని నీవు దేనినైనను తీసికొనలేదని వారు చెప్పగా

1 సమూయేలు 12 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी