యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా?
1విశ్రాంతిదినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోనికి వెళ్లినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టు చుండిరి.
2అప్పుడు జలోదర రోగముగల యొకడు ఆయన యెదుట ఉండెను.
3యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా?
4అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి
5మీలో ఎవని గాడిదయైనను ఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దానిని పైకి తీయడా? అని వారి నడి గెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి