అపో. కార్యములు 5:39

దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.

సందర్భంతో చదవండి · అపో. కార్యములు 5

37వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతో కూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి.

38కాబట్టి నేను మీతో చెప్పునదేమనగాఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలో చనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగిన దాయెనా అది వ్యర్థమగును.

39దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.

40వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించియేసు నామ మునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.

41ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి

అపో. కార్యములు 5 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी