ద్వితియోపదేశకాండము 12:17

నీ ధాన్యములో నేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱ మేకల మందలోని దేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్చా éర్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక

సందర్భంతో చదవండి · ద్వితియోపదేశకాండము 12

15అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది యిండ్ల న్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రు లేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును.

16మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.

17నీ ధాన్యములో నేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱ మేకల మందలోని దేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్చా éర్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక

18నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ యింట నుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు.

19నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువ కూడదు సుమీ.

ద్వితియోపదేశకాండము 12 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी