లూకా 11:33

ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును.

సందర్భంతో చదవండి · లూకా 11

31దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరమువారితో కూడ లేచి వారిమీద నేరస్థాపనచేయును. ఆమె సొలొ మోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.

32నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరమువారితో కూడ నిలువబడి వారిమీద నేరస్థాపనచేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి; ఇదిగో యోనా కంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.

33ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును.

34నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగు మయమై యుండును; అది చెడినదైతే నీ దేహ మును చీకటిమయమై యుండును.

35కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచు కొనుము.

లూకా 11 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी