యెషయా 57:10

నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.

సందర్భంతో చదవండి · యెషయా 57

8నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పుచేసికొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమిం చితివి.

9నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి

10నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.

11ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి? నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి బహుకాలమునుండి నేను మౌనముగానుండినందు ననే గదా నీవు నాకు భయపడుట లేదు?

12నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్‌ప్రయోజనములగును.

యెషయా 57 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी