కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.
10వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు.
11మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కన బడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
12కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.
13మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి.
14అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి