సంఖ్యాకాండము 6:20

తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠిత మైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరు వాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును.

సందర్భంతో చదవండి · సంఖ్యాకాండము 6

18అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించు కొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను.

19మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రతసంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటి నుంచవలెను.

20తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠిత మైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరు వాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును.

21మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహో వాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.

22యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము

సంఖ్యాకాండము 6 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी