ద్వితియోపదేశకాండము 2:24

మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాని స్వాధీన పరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.

సందర్భంతో చదవండి · ద్వితియోపదేశకాండము 2

22అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానముకొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుటనుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారిచోట నివసించుచున్నారు.

23గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులోనుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారిచోట నివసించిరి.

24మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాని స్వాధీన పరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.

25నేడు నేను నీవలని భయము నీవలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్నుగూర్చిన సమాచారము విని నీయెదుట వణకి మనోవేదన నొందుదురు.

26అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి

ద్వితియోపదేశకాండము 2 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी