యెహేజ్కేలు 44:7

ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగ పరచిరి.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 44

5​యెహోవా నాకు సెలవిచ్చినదేమనగానరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడ లన్నిటిని విధులన్నిటిని నేను నీకు తెలియజేయుచున్నాను; నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చెవినిబెట్టుము. మరియు పరిశుద్ధస్థలములోనుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరములోపలికి వచ్చుటను గూర్చి యోచించుము.

6​తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీ యులకు ఈ మాట ప్రకటింపుముప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలీయులారా, యిదివరకు మీరు చేసిన హేయక్రియలన్ని చాలును.

7ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగ పరచిరి.

8​నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువు లను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి.

9కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాహృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులై యుండి ఇశ్రాయేలీ యులమధ్య నివసించువారిలో ఎవడును నా పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.

యెహేజ్కేలు 44 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी