నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.
15మీ విరోధు లందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
16తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు;
17నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.
18గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.
19మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి