ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్ష మగు దినమున జరుగును.
28లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి.
29అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.
30ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్ష మగు దినమున జరుగును.
31ఆ దినమున మిద్దెమీద ఉండు వాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగ కూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు.
32లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి