మీ పితరు లేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా?
3కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగామీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
4మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలుసైన్యములకు అధి పతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ దుర్మార్గ తను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రక టించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే యెహోవా వాక్కు.
5మీ పితరు లేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా?
6అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగిమన ప్రవర్తననుబట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.
7మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవ త్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి