అపో. కార్యములు 20:33

ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్ర ములనైనను నేను ఆశింపలేదు;

సందర్భంతో చదవండి · అపో. కార్యములు 20

31కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మను ష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగాఉండుడి.

32ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచ బడినవారందరిలో స్వాస్థ్య మనుగ్రహించుటకును శక్తి మంతుడు.

33ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్ర ములనైనను నేను ఆశింపలేదు;

34నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.

35మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.

అపో. కార్యములు 20 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी