యెహేజ్కేలు 12:21

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 12

19దేశములోని జనులకీలాగు ప్రకటించుముయెరూషలేము నివాసులనుగూర్చియు ఇశ్రాయేలు దేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దానిలో నున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగు దురు

20నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసి కొనునట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును.

21మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

22నరపుత్రుడా దినములు జరిగి పోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగు చున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత యేమిటి?

23​కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగాఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుముదినములు వచ్చుచున్నవి, ప్రతిదర్శనము నెర వేరును

యెహేజ్కేలు 12 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी