ఆదికాండము 19:10

అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి.

సందర్భంతో చదవండి · ఆదికాండము 19

8ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెల వైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.

9ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారునీవు అవ తలికి పొమ్మనిరి. మరియు వారువీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగానుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమి్మగాపడి తలుపు పగులగొట్టు టకు సమీపించిరి.

10అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి.

11అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలవరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.

12అప్పుడామనుష్యులు లోతుతోఇక్కడ నీకు మరియెవ రున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొనిరమ్ము;

ఆదికాండము 19 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी