2 సమూయేలు 16:18

​హూషై యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును.

సందర్భంతో చదవండి · 2 సమూయేలు 16

16దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి యగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా

17అబ్షాలోమునీ స్నేహితునికి నీవు చేయు ఉపకార మింతేనా నీ స్నేహితునితో కూడ నీవు వెళ్లకపోతివేమని అతని నడుగగా

18​హూషై యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును.

19మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను.

20అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసి కొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా

2 సమూయేలు 16 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी