ఎజ్రా 5:14

మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములోనుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములోనుండి తెప్పించి

సందర్భంతో చదవండి · ఎజ్రా 5

12మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయు డైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.

13అయితే బబులోనురాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సర మందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.

14మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములోనుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములోనుండి తెప్పించి

15తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను నతనికి అప్పగించినీవు ఈ ఉపకరణములను తీసికొని యెరూషలేము పట్టణ మందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

16కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోనుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటినుండి నేటివరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తికాకుండ ఉన్నది.

ఎజ్రా 5 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी