ప్రసంగి 5:15

వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చి నట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాస పడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు;

సందర్భంతో చదవండి · ప్రసంగి 5

13సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించు కొనును.

14అయితే ఆ ఆస్తి దురదృష్టమువలన నశించి పోవును; అతడు పుత్రులుగలవాడైనను అతనిచేతిలో ఏమియు లేకపోవును.

15వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చి నట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాస పడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు;

16అతడు వచ్చిన ప్రకారముగానే మరల పోవును; గాలికి ప్రయాసపడి సంపాదించినదానివలన వానికి లాభమేమి?

17ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినము లన్నియు అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును.

ప్రసంగి 5 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी