లేవీకాండము 24:4

అతడు నిర్మల మైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.

సందర్భంతో చదవండి · లేవీకాండము 24

2దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.

3ప్రత్యక్షపు గుడార ములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అది వెలుగు నట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

4అతడు నిర్మల మైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.

5నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను.

6​యెహోవా సన్నిధిని నిర్మల మైన బల్లమీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను.

లేవీకాండము 24 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी