1 దినవృత్తాంతములు 27:25

రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను.

సందర్భంతో చదవండి · 1 దినవృత్తాంతములు 27

23ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు.

24జన సంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే గాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు.

25రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను.

26పొలములో పనిచేయువారిమీదను, భూమిదున్ను వారిమీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింప బడెను.

27ద్రాక్షతోటలమీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి.

1 దినవృత్తాంతములు 27 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी