1 రాజులు 4:19

గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను; అతడు ఒక్కడే ఆ దేశ మందు అధికారి.

సందర్భంతో చదవండి · 1 రాజులు 4

17ఇశ్శాఖారు దేశమందు పరూ యహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను.

18బెన్యా మీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ యుండెను.

19గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను; అతడు ఒక్కడే ఆ దేశ మందు అధికారి.

20అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి.

21నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి.

1 రాజులు 4 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी