లేవీకాండము 11:34

తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్ళు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము.

సందర్భంతో చదవండి · లేవీకాండము 11

32వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్ర మగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమే గాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయం కాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్ర మగును.

33వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను.

34తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్ళు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము.

35వాటి కళే బరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్ర మగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను.

36అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్ర మగును.

లేవీకాండము 11 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी