1 రాజులు 1:15

​కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టు చుండెను.

సందర్భంతో చదవండి · 1 రాజులు 1

13​నీవు రాజైన దావీదునొద్దకు పోయినా యేలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చితివే; అదోనీయా యేలుచుండుట యేమని అడుగవలెను.

14​రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీవెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను.

15​కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టు చుండెను.

16​​బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజునీ కోరిక ఏమని అడిగి నందుకు ఆమె యీలాగు మనవి చేసెను

17నా యేలిన వాడా, నీవు నీ దేవుడైన యెహోవాతోడని నీ సేవకు రాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారు డైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే,

1 రాజులు 1 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी