అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను.
13వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చిమేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము.
14కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.
15అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను.
16అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచిఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడు కొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను.
17శతాధిపతి సహస్రాధిపతియొద్ద కతని తోడుకొనిపోయిఖైదీయైన పౌలు నన్ను పిలిచినీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి