నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి.
1రాజకుమార పుత్రికా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచు చున్నావు! నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి.
2నీ నాభీదేశము మండలాకార కలశము సమి్మళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండును గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి
3నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి.
4నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.
5నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి. రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి