ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి,మీ యెముకలను మీ బలి పీఠములచుట్టు పారవేయుదును.
3ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభు వైన యెహోవా మాట ఆలకించుడి; పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థల ములను నాశనము చేసెదను.
4మీ బలిపీఠములు పాడై పోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్న ములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.
5ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి,మీ యెముకలను మీ బలి పీఠములచుట్టు పారవేయుదును.
6నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు ఛిన్నా భిన్న ములగును,సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడ గొట్ట బడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడువబడును,
7మీ జనులు హతులై కూలుదురు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి