మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నియు ప్రజలకు వినిపించిరి.
42చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను.
43జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.
44మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నియు ప్రజలకు వినిపించిరి.
45మరియు మోషే యీ మాటలన్నియు ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి
46మరల వారితో ఇట్లనెనుమీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మన స్సులలో పెట్టుకొని, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారి కాజ్ఞాపింపవలెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి