2 దినవృత్తాంతములు 17:15

రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండు లక్షల ఎనుబదివేలమంది యుండిరి.

సందర్భంతో చదవండి · 2 దినవృత్తాంతములు 17

13యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతని క్రింది పరా క్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.

14వీరి పితరుల వంశములచొప్పున వీరి సంఖ్య యెంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నాయొద్ద మూడు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.

15రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండు లక్షల ఎనుబదివేలమంది యుండిరి.

16​మూడవవాడు జిఖ్రీ కుమారుడై యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా; అతనియొద్ద రెండు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.

17బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.

2 దినవృత్తాంతములు 17 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी