దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
1ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
2భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
3దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
4వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
5దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి